ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాలున్న వాహనం కలకలం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే!
దక్షిణ ముంబయిలోని ఆ స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ శుక్రవారం వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నట్టు ఠానే పోలీసులు వెల్లడించారు. పేలుడు పదార్థాలున్న వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ మృతదేహం శుక్రవారం ముంబయికి సమీపంలోని ఓ వాగులో గుర్తించినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 25న జిలెటిన్ స్టిక్స్తో ఉన్న ఓ స్కార్పియో ఎస్యూవీ వాహనాన్ని అంబానీ ఇంటికి సమీపంలో పోలీసులు గుర్తించారు. ఆ వాహనం విక్రోలీలో నివసించే మన్సుఖ్ హిరెన్కు చెందిందని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. ఆ వాహనంలో నీతా అంబానీకి రాసిన ఓ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం అంతకుముందే చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ వాహనాన్ని తామే ముకేశ్ అంబానీ నివాసం వద్ద ఉంచినట్లు జైష్- ఉల్- హింద్ సంస్థ ప్రకటించుకుంది. కానీ ఈ ఘటనతో ఆ సంస్థకు సంబంధంలేదని పోలీసులు స్పష్టంచేశారు.