జాతీయం (National) వార్తలు (News)

రిక్టర్‌ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపనలు

నేపాల్‌ సరిహద్దు రాష్ట్రాలైన బీహార్‌, అస్సాం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్‌ జిల్లాల్లో రాత్రి 8 గంటల 49 నిమిషాల ప్రాంతంలో సోమవారం భూ ప్రకంపనలు సంభవించాయి.సిక్కిం-నేపాల్‌ సరిహద్దులో రిక్టర్‌ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.4గా నమోదైంది. ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించ లేదని, ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఇండ్ల నుంచి పరుగులు తీశారని అధికారులు తెలిపారు. పిబ్రవరి 15న బీహార్‌ రాజధాని పట్నాలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 3.5గా నమోదైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.