దేశంలో సోమవారం 96,982 మంది వైరస్ బారినపడడంతో మొత్తం కేసుల సంఖ్య 1,29,12,090కి చేరింది. నిన్నటికి 7,88,223 క్రియాశీల కేసులుండడంతో ఆ రేటు 5.89 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 50,143 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోటీ 17 లక్షల మంది కోలుకోవడంతో రికవరీ రేటు 92.80 శాతానికి పడిపోయింది. కొత్తగా 446 మంది మృత్యుఒడికి చేరుకోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,65,547కి చేరింది.