క్రైమ్ (Crime) వార్తలు (News)

బందీగా ఉన్న కమెండో క్షేమం అంటూ మావోయిస్టుల లేఖ

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన గురించి పాఠకులందరికి విదితమే! ఆ ఎన్‌కౌంటర్‌ ఘటన అనంతరం ఒక కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు బందించి తమతో తీసుకువెళ్లారు. తాజాగా దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ పేరిట మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు వేల మంది పోలీసులు వారిపై దాడికి వచ్చినట్లు, కేంద్ర మంత్రి అమిత్‌షా నాయకత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులతో భారీ దాడులకు పథకం పన్నారని ఆ లేఖలో ఆరోపించారు. పోలీసుల దాడికి తాము ప్రతిదాడి మాత్రమే చేశామని, ఈ ఎన్‌కౌంటర్‌లో 23 మంది పోలీసులు చనిపోగా మరో పోలీసు తమ వద్ద బందీగా ఉన్నట్లు చెప్పారు. అలాగే పోలీసుల దాడిలో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు వెల్లడించారు. మధ్యవర్తి పేరు ప్రకటిస్తే బందీగా ఉన్న పోలీసును అప్పగిస్తామని, పేరు ప్రకటించే వరకూ ఆ పోలీసు తమ వద్ద క్షేమంగా ఉంటారని, చర్చలకు మావోయిస్టులు సిద్ధంగానే ఉన్నారని, ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మావోయిస్టులకు పోలీసులు శత్రువులు కాదని, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టుల లేఖ :

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.