క్రైమ్ (Crime) వార్తలు (News)

లాక్‌డౌన్ నకిలీ జీవోతో గందరగోళం సృష్టించిన వ్యక్తి అరెస్ట్

ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తున్నారంటూ నకిలీ జీవోను సృష్టించి, దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌చేసిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను హైదరాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఆ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి మాదాపూర్‌కు చెందిన శ్రీపతి సంజీవ్‌కుమార్‌ అని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం తెలిపారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో చార్టెర్డ్‌ అకౌంటెంట్‌‌గా పనిచేస్తున్నారు. కేవలం స్నేహితులను ఏప్రిల్‌ ఫూల్‌ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ జీవోను రూపొందించినట్టు, గతంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినప్పుడు విడుదల చేసిన జీవోను డౌన్‌లోడ్‌ చేసుకొని నకిలీ జీవోను తయారుచేసినట్టుగా ఆయన చెప్పారు. అయితే నకిలీ వార్తలు, నకిలీ జీవోలను ఫార్వర్డ్‌ చేసే వాట్సాప్‌ అడ్మిన్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేసే ముందు ప్రతి ఒక్కరూ, అందులో నిజా నిజాలు తెలుసుకుని స్పందించాలని ఆయన సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.