ఎన్నికలు (Elections) వార్తలు (News)

ఆ ఐదు రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మంగళవారం పోలింగ్ మొదలైంది. ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తంగా 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో 475 స్థానాలకు మంగళవారమే పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో మొత్తం అన్ని స్థానాలకూ పోలింగ్ ఈ రోజే పూర్తవుతోంది కానీ బెంగాల్‌లో మాత్రం ఈ రోజు జరిగేది మూడో దశ పోలింగ్. మొత్తం ఎనిమిది దశల్లో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.ఇక అసోం ఎన్నికల్లో చివరి, మూడో దశ పోలింగ్ ఈరోజే పూర్తవుతుంది. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడి కానున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.