ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం నుంచి దమ్మాయిగూడెం వైపుకు వెళ్లుతుండగా ఎస్‌ఐ వాహనం ఎదురుగా వచ్చిన ఐస్ క్రీం బండిని తప్పించబోయి అదుపుతప్పి రెండు పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు ఎస్‌ఐ ఉండగా ఎస్‌ఐకు స్పల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వేరే వాహనం తెప్పించుకోని తిరుమలాయపాలెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడ చికిత్స అనంతరం ఎస్‌ఐ తిరిగి మళ్లీ విధుల్లో పాల్గొన్నారు. ప్రమాద సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.