కరోనా పరిస్థితుల దృష్ట్యా పదో తరగతి పరీక్షా కేంద్రాలు చదివే పాఠశాలకు అయిదు కిలోమీటర్ల పరిధిలోనే ఉండేలా ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు గరిష్ఠంగా 8కి.మీ. పరిధిలోని పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. ప్రకటించిన కాలపట్టిక ప్రకారం పదో తరగతి ప్రధాన సబ్జెక్టులు మే 17న మొదలై 22కి పూర్తవుతాయి. ఆపై మూడు రోజులపాటు ఓరియంటల్‌ విద్యార్థులకు పరీక్షలున్నావందల మందే హాజరవుతారు కాబట్టి పదో తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు పాఠశాలల్లో లేకుంటే ప్రభుత్వ లేదా ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలనూ పరీక్షా కేంద్రాలుగా ఎంచుకోవాలని భావిస్తున్నారు. అప్పటికే ఇంటర్‌ పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి వాటిని తీసుకున్నా ఇబ్బంది లేదని భావిస్తున్నారు.