జాతీయం (National) వార్తలు (News)

ఊగిసలాటల మధ్య నేటి స్టాక్ మార్కెట్లు

మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమై కొద్దిసేపట్లోనే లాభాల్లోకి చేరుకుని మళ్ళీ ఒంటిగంట తర్వాత ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుని తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. ఉదయం 49,441 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 49,582 వద్ద గరిష్ఠాన్ని, 48,936 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 42 పాయింట్ల లాభంతో 49,301 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,737 వద్ద ప్రారంభమై 14,779-14,573 మధ్య ఊగిసలాడి ఆఖరుకు 45 పాయింట్లు లాభపడి 14,683 వద్ద స్థిరపడింది.

లోహ, పారిశ్రామిక, మౌలిక, స్థిరాస్తి, ఎఫ్ఎంసీజీ, టెలికాం రంగాల షేర్లు లాభాల్లో ఉండగా బ్యాంకింగ్‌, ఇంధన రంగం, పీఎస్‌యూ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీలో ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల షేర్లు లాభపడగా పవర్‌గ్రిడ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.