అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

మయన్మార్‌ పలు ప్రాంతాల్లో 40 మృతదేహాల లభ్యం??

మయన్మార్‌దేశంలోని మధ్య ప్రాంతం సాగింగ్‌ లో కని అనే పట్టణంలోని పలు చోట్ల సుమారు 40 మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మృతదేహాలను స్థానికులు గుర్తించడం జరిగింది. సైన్యం, సైనిక పాలనకు వ్యతిరేకంగా ఏర్పడ్డ మిలీషియా గ్రూపుల మధ్య జరుగుతున్న పోరులో వీరంతా మరణించి అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న అనేక మృతదేహాలు చిత్ర హింసలకు గురైనట్లు కనిపిస్తోందని మిలీషియా సభ్యులు మరియు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 1న మయాన్మార్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసిన జుంటా ఆర్మీ.. ఆర్మీపై వ్యతిరేకంగా ఆందోళనలను చేపట్టిన వారిని కాల్చి పారేస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •