వార్తలు (News)

భారత్ లో 44,643 కొత్త కేసులు..464 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 16,40,287 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 44,643 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.18 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే మరో 464 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.26లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,14,159 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.30 శాతానికి పెరిగింది. నిన్న 41వేల మంది వైరస్‌ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీలు 3.10 కోట్లకు చేరుకొని రికవరీ రేటు 97.36 శాతంకి చేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •