క్రైమ్ (Crime) జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఫిషింగ్ మెసేజ్‌లకు స్పందించకండి : ఎస్‌బీఐ!!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం కోరుతూ ఎలాంటి మెసేజ్(SMS)లు వచ్చిన స్పందించవద్దని,మెసేజ్‌ల విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు పొదుపు చేసిన సొమ్మంతా పోయే అవకాశం ఉందని, ఎస్‌బీఐ కస్టమర్లకు జాగ్రత్తగా ఉండాలంటూ అవగాహన కల్పిస్తోంది.

ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేస్తూ తమ వినియోగదారులు మోసపోకుండా అవగాహన కల్పిస్తూ, ‘ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంకింగ్ తదితర వివరాల కోసం ఈమెయిల్స్/మెసేజ్(SMS)/ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్లను సంప్రదించం. మీ సమాచారం కోరుతూ వచ్చిన ఎలాంటి మెసేజ్‌లను నమ్మకండి. ఏదైనా సమచారం కావాలంటే దగ్గరలోని బ్యాంకును సంప్రందించండి. మీ వ్యక్తిగత వివరాలు పంపమని ఎస్‌బీఐ అస్సలు కోరదు. ఇలాంటి SMiShing మెసేజ్‌లపై Report.phishing@sbi.co.in లేదా సైబర్ క్రైమ్‌ హెల్ప్‌లైన్ నంబర్ 155260 కి కాల్ చేయాలి’ అని కోరుతుంది.

వినియోగదారులు ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు ఏవైనా వస్తే వెంటనే తొలగించాలని, మీ కార్డు నంబర్/ సీవీవీ (CVV)/ పిన్ (PIN) నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరితో పంచుకోకూడదని వినియోగదారులను హెచ్చరించింది.

ఫిషింగ్ దాడులు ఎలా జరుగుతాయో తెలుసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం!

ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగదారుడు మోసపూరిత ఈ-మెయిల్‌ను అందుకోగానే మెయిల్‌లో సూచించిన హైపర్‌లింక్‌పై క్లిక్ చేయలంటూ మోసగాళ్లు సూచిస్తారు. యూజర్ హైపర్‌లింక్‌ని క్లిక్ చేయగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్‌ లాగే ఉండే నకిలీ వెబ్‌సైట్‌కి ఆ లింక్ తీసుకెళ్తుంది. సాధారణంగా, ఈమెయిల్‌ను క్లిక్ చేస్తే బహుమతులు లభిస్తాయంటూ మభ్యపెడుతుంది. లేదంటే పెనాల్టీ పడుతుందంటూ భయపెడతారు. లాగిన్/ప్రొఫైల్ లేదా లావాదేవీ పాస్‌వర్డ్‌లతో పాటు బ్యాంక్ ఖాతా నెంబర్ల లాంటి వ్యక్తిగత అకౌంట్ వివరాలను అందించాలంటూ వినియోగదారులను కోరుతుంటారు. వినియోగదారులకు అవగాహన లేకపోవడం వల్ల వ్యక్తిగత అకౌంట్ వివరాలను అందించి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేస్తారు. అనంతరం ఎర్రర్ పేజీ దర్శనమిస్తుంది. దాంతో వినియోగదారుడు ఫిషింగ్ దాడికి గురయ్యాడని అర్థం చేసుకోవాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    53
    Shares
  • 53
  •  
  •  
  •  
  •