ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

వర్షాకాలంలో కూడా ఫ్రిడ్జ్ నీళ్లు తాగుతున్నారా??

సాధారణంగా నీటి కాలుష్యం వల్ల ఎన్నో రకాలుగా వ్యాధుల బారిన పడుతుంటాము. వర్షాకాలం వరదలతో తాగునీరు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్వచ్చమైన నీరు తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగేనీటిని మట్టి లేదా రాగి పాత్రలో మాత్రమే స్టోర్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మేలు అని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతుంటారు. ఫ్రిజ్ వాటర్ తాగడం అంత మంచిది కాదని అంటున్నారు. మట్టి పాత్రల్లో నీరు నిల్వ చేయడం వల్ల చల్లగా ఉంటాయి.

మట్టిపాత్రలోని నీరు తాగడం వల్ల శరీరంలో ఎసిడిటీ, చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ
నీరు తాగడానికి రుచిగా కూడా ఉంటాయి. నీళ్లు తక్కువగా తాగే వారు ఈ పాత్రల్లో నిల్వ చేసుకుంటే ఎక్కువగా తాగే అవకాశం ఉంటుంది.

ఇక మంచినీటిని స్టోర్ చేసుకునే విధానంలో రెండో పద్ధతి రాగిపాత్ర. ఈ పాత్రలో నీటిని నిల్వ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. వాత, పిత, కఫా వంటి రోగాల బారి నుండి కాపాడుతుంది. రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన రాగి మూలకం కూడా ఈజీగా అందుతుంది.

గతంలో పూర్వికులు ఎక్కువగా తాగునీటికి రాగి గ్లాసులను వాడేవారన్న సంగతి మనకు కూడా తెలిసిన ఇర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ముఖ్యంగా రాత్రి రాగి పాత్రలో నీళ్లు పోసి ఉదయాన్నే పరగడపున తాగడం మంచిది. అయితే రాగి పాత్రలో ఆహారాన్ని వంటడం, లేదా నీళ్లు, పాలు వేడి చేయడం మంచిది కాదని, దీని వల్ల రాగి విషతుల్యం అవుతుందని నిపుణుల అభిప్రాయం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    347
    Shares
  • 347
  •  
  •  
  •  
  •