ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఇక పురుషులకూ అందుబాటులోకి రానున్న కుటుంబ నియంత్రణ మాత్ర!

పురుషుల కోసం తొలిసారిగా కుటుంబ నియంత్రణ మాత్ర తయారీ దిశగా అడుగులు వేయడానికి తోడ్పాటుగా బిల్‌ గేట్స్‌ వచ్చే రెండేళ్లలో 17 లక్షల డాలర్ల నిధులు అందించనున్నారు. కండోమ్‌ అభివృద్ధి తర్వాత పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలేవీ రూపొందలేదని, ఫలితంగా అవాంఛిత గర్భాల నుంచి రక్షణ భారం ఎక్కువగా మహిళలపైనే పడుతోందని, ఈ అసమానత్వాన్ని తాము సరి చేయాలనుకుంటున్నట్లు స్కాట్లాండ్‌లోని దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త క్రిస్‌ బారాట్‌ తెలిపారు. రెండేళ్లలోగా అనువైన మాత్రను కొనుగొని, మొదటి దశ ప్రయోగాల దశకు చేరుకుంటామని ఆయన ఆశాభావం వేయటం చేసారు.

ప్రస్తుతం పురుష కుటుంబ నియంత్రణ మాత్రల అభివృద్ధిలో ఉన్న అనేక అవరోధాలలో ఒకటి.. వీర్య కణ జీవశాస్త్రంపై శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, రెండు.. వీర్య కణంలో కీలక విధులకు తోడ్పడే ముఖ్య ప్రొటీన్‌ను గుర్తించే అధ్యయనాలు జరగకపోవడం, మూడోది.. ప్రస్తుతమున్న అనేక రసాయనాలు, ఔషధాల ప్రభావాన్ని స్క్రీన్‌ చేసే సమర్థ వ్యవస్థ లేకపోవడం.. ఈ ఇబ్బందులను అధిగించడానికి దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చిన్నపాటి, సమాంతర పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేశారు. అందులో వేగవంతమైన మైక్రోస్కోపు, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ సాధనాలు ఉండి అవి మానవ వీర్య కణాల వేగవంతమైన కదలికలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం ద్వారా ఔషధాల సమర్థతను కొలవడానికి వీలవుతుందని ఆయన చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •