టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

టీఎస్‌ ఎంసెట్‌ లో తొలిరోజు గణితం.. కఠినం!!

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఎంసెట్‌ బుధవారం ప్రారంభం కాగా తొలిరోజు గణితం ప్రశ్నలు విద్యార్థులను కాస్త ఇబ్బంది పెట్టాయి. కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా, మరికొన్ని ప్రశ్నలు అతిపెద్దగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడగా నాలుగైదు ప్రశ్నలు అతిపెద్దగా ఉండటంతో అధిక సమయాన్ని తీసుకున్నాయి. ఫలితంగా విలువైన సమయాన్ని కోల్పోయినట్టు, రెండు సెషన్లల్లోనూ ఇచ్చిన ప్రశ్నలను మూడుగంటల్లో పూర్తిచేసే వీలులేకపోయిందని, రఫ్‌ చేసుకోవడానికి పేపర్లు తక్కువగా వచ్చాయని విద్యార్థులు పేర్కొన్నారు.

ఎంసెట్‌ తొలిరోజు రెండుసెషన్లు కలుపుకుంటే 54,983 మంది విద్యార్థులకు 50,134 మంది (91.18శాతం) విద్యార్థులు హాజరు కాగా, ఉదయం పరీక్షకు తెలంగాణలో 21,801 మందికి 20,363 మంది (93.40 శాతం), ఏపీలో 5,655 మందికి 4,718 మంది (83.43 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ-తెలంగాణ కలుపుకుంటే 27,456 మందికిగాను 25,080 (91.35 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు తెలంగాణలో 21,978 మందికి 20,446 (93.03 శాతం) మంది, ఏపీలో 5,549 మందికిగాను 4,608 (83.04శాతం) విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ-తెలంగాణ కలుపుకుంటే 27,527 మందికి 25,054 (91.02శాతం) మంది పరీక్ష రాసినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •