వార్తలు (News)

కృష్ణా తీర ప్రాంతాలకు హై అలర్ట్‌!!

పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు 5లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలకు హై అలర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 1.12లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు, కాలువలకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ దిగువకు 1.3లక్షల క్యూసెక్కులు, ఏలూరు, బందరు, రైవస్‌ కాలువలతో పాటు గుంటూరు ఛానల్‌కు మొత్తంగా 9,689 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రవాహాలు మరింతగా పెరిగే అవకాశముండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన ఉన్న ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. దిగువన కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశారు.

పులిచింతల ఔట్‌ ఫ్లో గురువారం సాయంత్రానికి 4.97లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 6లక్షల క్యూసెక్కులకు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. అంతకు మించితే కృష్ణా తీర గ్రామాలు ముంపు బారిన పడే ప్రమాదముంది. పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 34.67 టీఎంసీలుగా ఉంది. నీటి నిల్వ 10 టీఎంసీలు తగ్గితే స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటుకు అవకాశముంటుందని అధికారులు తెలిపారు. దీంతో పెద్దమొత్తంలోనే రిజర్వాయర్‌ నుంచి నీటిని ఖాళీ చేయాల్సి వస్తోంది. ప్రాజెక్టుకు భారీ వరద వల్ల గేటు ఏర్పాటు ఆలస్యమయ్యే అవకాశముంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    10
    Shares
  • 10
  •  
  •  
  •  
  •