అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

హిరోషిమా, నగాసాకి.. అణుబాంబు దాడికి.. 76 ఏళ్లు!!

మానవ నాగరికత సృష్టించిన అత్యంత భయంకర ఆయుధం ఆగస్టు 6 న ప్రయోగించబడి తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించింది. 1945 ఆగస్టు 6 ఉదయం 8.16 నిమిషాలకు అమెరికా ప్రయోగించిన తొలి అణుబాంబు (లిటిల్‌ బారు) జపాన్‌ లోని హిరోషిమా నగరంలో పాఠశాలలకు వెళుతున్న చిన్నారులతో సహా అప్పటికప్పుడు 1,40,000 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకోగా,మరో 35,000 మందిని క్షతగాత్రులను చేసింది. హిరోషిమాపై వదిలిన బాంబుపేరు లిటిల్‌ బాయ్‌. ఇది సుమారు 12,000 నుంచి 15,000 టన్నుల టీఎన్‌టీకి సమానమైన పేలుడు సామర్థ్యం ఉన్న బాంబు కాగా, దీని విధ్వంస పరిధి 13 చదరపు కిలోమీటర్లు. హిరోషిమాపై బాంబు వేసిన తర్వాత కూడా జపాన్‌ లొంగిపోతున్నట్లు ప్రకటించలేదు. దీంతో మరో మూడు రోజుల తర్వాత అంటే ఆగస్టు 9, 1945 ఉదయం 11.02 నిమిషాలకు నగాసాకి నగరంపై అమెరికా మరో అణుబాంబును విడిచింది. నాగసాకి పై అమెరికా వేసిన రెండో బాంబు (ఫ్యాట్‌ మాన్‌) సుమారు 74,000 మంది ప్రాణాలు తీసింది. ఈ రెండు బాంబులనే ప్రపంచంలో ఇప్పటివరకు మానవులపై ప్రత్యక్షంగా ప్రయోగించబడిన అణు బాంబులుగా చెప్తారు. ఇవి సృష్టించిన విధ్వంసం బాంబులు ప్రయోగించబడిన క్షణానికే పరిమితం కాకుండా ఆ తరువాత నెలలు, సంవత్సరాల పాటు ప్రజలు చనిపోతూనే ఉన్నారు. కాలిన గాయాలు, అణు రేడియేషన్‌ ప్రభావంతో క్యాన్సర్‌ వంటి వ్యాధులతో మరో లక్షన్నరమందికి పైగా మరణించారు. కొన్ని లక్షల మంది అంగ వైకల్యాలకు గురైనారు. అణుధార్మికతకు గురైన వారి బిడ్డల్లో, వారి తరువాతి తరాల్లో కూడా దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది.

హిరోషిమా దాడిలో గాయపడిన ఒక మహిళ

ఇప్పటి వరకు హిరోషిమా, నాగసాకి తరువాత ప్రపంచంలో మరెక్కడా అణు బాంబులను ప్రయోగించినప్పటికీ ప్రపంచం లోని 9 దేశాల వద్ద ప్రస్తుతం 16,000 పైగా అణు బాంబులు సిద్ధంగా ఉన్నాయని సమాచారం! హిరోషిమా, నాగసాకిలతో పోలిస్తే ఈ బాంబులు ఒక్కోదాని విధ్వంసక సామర్ధ్యం కొన్ని వందల రెట్లు ఎక్కువ. అంటే ఈ బాంబులన్నీ పేలితే భూగోళం ఒక్కసారి కాదు, వందల సార్లు భస్మీపటలం అవుతుంది. వీటిలో అమెరికా (7,000), రష్యా (7,000) అత్యధిక బాంబులు తయారు చేయగా చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, భారత్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయిల్‌, ఉత్తర కొరియాల దగ్గర కూడా ఆయా దేశాలను నాశనం చేయగలన్ని అణుబాంబులు వున్నాయి అలాగే అణుబాంబులను ప్రయోగించగల సాధనాలు కూడా ఆధునికమైనాయి.

దాడిలో గాయపడిన బాలుడు

ప్రస్తుతం యుద్ధ విమానాలే కాదు, అణుబాంబులను 10,000 కిలోమీటర్లకు పైగా మోసుకుపోయి ఖచ్చితంగా లక్ష్యంపై ప్రయోగించగల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు, అణు జలాంతర్గాములు కొన్ని వేల సంఖ్యలో ప్రపపంచమంతటా మోహరించబడి ఉన్నాయి. ఈ అణ్వాయుధాల వల్ల మొత్తం ప్రపంచానికే ప్రమాదం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •