ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

ఇలాగే కొనసాగితే నవరత్నాలు ఏంకావాలి జగన్ సాబ్??

ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ జరగని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయాన్ని సాధించి ఘానా విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 85శాతం సీట్లను సొంతం చేసుకుని ఆ విజయోత్సాహంతో కనీసం ముప్పై ఏళ్ళ పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న కోరికను బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగిన విధంగానే నవరత్నాలు, సంక్షేమ పథకాల పేరుతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నారు. అలాగే ప్రతి నెల ఒకటో, రెండో సంక్షేమ పథకాలు అమలవుతూనే ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలవుతోందని ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టినా సరే జగన్ మాత్రం తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. కులం,మతం,పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధంగా పథకాలను అందిస్తున్నారు.

తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా గీతదాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వచ్చారు. అయితే నిజానికి మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని ఆరోపణలు అడపా దడపా వస్తూనే ఉన్నాయి.

జగన్ హెచ్చరికలు, ఆదేశాలను కొందరు బేఖాతరు చేస్తూ, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని అనుసరిస్తూ వచ్చే ఎన్నికల్లో సీటుకు గ్యారెంటీ లేదని, ఫ్యూచర్ సంగతి పక్కనబెట్టి ప్రజెంట్ గురించి ఆలోచించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారని సమాచారం!

తెలుగుదేశం పార్టీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి కారణంగానే 2019లో ఆ పార్టీ ఘోరంగా ఓడిందని రాజకీయ ప్రముఖుల ఉపాచః. దీన్ని దృష్టిలో ఉంచుకొన్న సీఎం జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చినవెంటనే అవినీతి విషయంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ సీఎం వార్నింగ్ ను గాలికొదిలేసిన కొంత మంది నేతలు అక్రమ మద్యం, పేకాట, ఇసుక, ఇతర వ్యవహారాల్లో తలదూర్చుతూ కోట్లలో వెనకేసుకుంటున్నట్లు పలు సందర్భాల్లో బట్టబయలైంది కూడా!

మరికొందరేమో స్థానికంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కన్ స్ట్రక్షన్ కంపెనీలు, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీల రూపంలో వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన వారికి గతంలో టీడీపీ వాళ్లు చేస్తే నోరు విప్పనివాళ్లు ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఎదురు తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఇప్పటికి రెండున్నరేళ్ళు గడిచిపోయింది. మంత్రి పదవులు వస్తాయనే ఆశ ఎలాగూ లేదు గత పదేళ్లుగా పార్టీ కోసం తమ ఆస్థులు తాకట్టు పెట్టి ఎన్నికలలో పోరాటం సలిపామని పదవీకాలం ముగిసేలోగా వెనకేయకపోతే మళ్ళీ ఎన్నికల సమయంలో పోరాడడానికి ఖర్చు చేయలేని స్థితికి చేరుకుంటామని కొందరు భావిస్తున్నట్టుగా సమాచారం!

ప్రస్తుత పరిస్థితుల్లో తన సొంత పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని అరికట్టలేని నాడు జగన్ కు రాబోవు ఎన్నికలలో ఎదురు దెబ్బ తగలడం తప్పదనేది రాజకీయ విశ్లేషకుల మాట!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •