జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఈరోజు, రేపు ఎస్‌బీఐ సేవలకు అంతరాయం!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు, రేపు కొన్ని గంటల పాటు తన కస్టమర్లకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని ముందే గుర్తించుకుని కావలసిన లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించింది. మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని, అందువల్ల కస్టమర్లు తమకు సహకరించాలని ఎస్‌బీఐ కోరింది. ఆగస్ట్ 6న 22.45 గంటల నుంచి ఆగస్ట్ 7న 01.15 గంటల వరకు బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు అందుబాటులో ఉండవని వివరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    3
    Shares
  • 3
  •  
  •  
  •  
  •