వార్తలు (News)

బ్యాంకులో సరిపడా బ్యాలెన్స్ ఉంటేనే చెక్ జారీ చేయండి.. లేదంటే??

టెక్నాలజీ రోజు రోజుకు మారుతూ కొత్తపుంతలు తొక్కుతున్నప్పటికీ కొన్ని ప్రభుత్వ సంస్థలు మాత్రం టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్నాయి. కేవలం కొన్ని సంస్థలు మాత్రమే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థలంటే ప్రముఖంగా చెప్పుకొనేది బ్యాంకింగ్ రంగం. బ్యాంకులు ఒక్కరోజు పనిచేయకపోతే కోట్లలో లావాదేవీలు నిలిచిపోతాయి. అలాగే బ్యాంకు సెలవు ఉందంటే ఒకరోజు ముందే బ్యాంకువద్ద జనం క్యూ కడతారు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ఆర్బీఐ నూతన విధానాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జనవరిలో ఆర్బీఐ పాజిటివ్‌ పే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ విధానంలో రూ.50వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కు లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు చెక్ వివరాలను రీ-కన్ఫర్మేషన్ చేయాలని సూచించింది.

ఈ ప్రక్రియలో చెక్కు జారీ చేసిన వారు చెక్ నంబరు, చెక్ తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబరు, అమౌంట్ తదితర వివరాలను సంబంధిత బ్యాంకు అధికారులకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో తెలియజేసి నిర్ధారించుకున్న తర్వాతనే చెక్కు ఎవరిపేరు మీద ఇష్యూ అయిందో వారికి ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. ఈ విధానం వలన మోసాలను అరికట్టవచ్చు. గతంలోలా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి చెక్కులు క్రాస్ చెక్ కోసం వెళ్లాల్సిన అవసరం ఉండకుండా మొత్తం ఆన్లైన్ లోనే జరిగిపోతుంది.

దానికి తగిన విధంగా బ్యాంకింగ్ నియమాల్లో ఆర్‌బీఐ కొన్ని మార్పులు చేయగా కొత్త రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా బల్క్ క్లియరింగ్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. నేషనల్ ఆటోమెటెడ్ క్లియరింగ్ హౌస్‌ (NACH-నాచ్‌) ఈ నెల నుంచి 24 గంటలూ పనిచేస్తుంది. ఈ నిర్ణయంతో సెలవు దినాల్లో కూడా చెక్ క్లియరింగ్‌కు వెళ్లి క్యాష్ చేసుకునే వీలుంటుంది. సెలవు కదా అని నిర్లక్ష్యంగా ఖాతాలో సరిపడా నగదు లేకుండా చెక్ ఇచ్చారంటే చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.

నాచ్‌ అనేది బల్క్ పేమెంట్ సిస్టమ్‌. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తుంది. డివిడెంట్‌, వడ్డీ, జీతం, పెన్షన్ వంటి క్రెడిట్ బదిలీలను ఒకరి నుంచి అనేక మందికి ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఒకటవ తేదీ బ్యాంకులకు సెలవు ఉన్నా జీతాలు ఉద్యోగుల అకౌంట్ లోకి క్రిడెట్ అవుతాయి. విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, వాటర్ బిల్లులు, రుణాలకు సంబంధించి క్రమానుగత వాయిదాలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, బీమా ప్రీమియంలు మొదలైనవి సులభంగా సేకరించవచ్చు. చెల్లింపులు చేసే అవకాశం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •