వార్తలు (News)

వడ్రంగికి అక్షరాలా రూ.6.74 లక్షలు.. కరెంట్ బిల్!!

పశ్చిమ గోదావరి జిల్లాలో జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన కానూరి లింగాచారికి ప్రతి నెలా రూ.1500 నుంచి రూ.2100 వరకు బిల్లు వస్తుంది. కానీ జులై నెలకు సంబంధించి విద్యుత్‌శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్‌ తీయగా అందులో రూ.6లక్షల74వేల900 వచ్చింది. ఆ బిల్లు చూసి లింగాచారికి సిబ్బంది ఇవ్వగా దాన్ని చూసి ఆ బిల్లు తీసుకుని వెంటనే విద్యుత్ అధికారుల దగ్గరకు పరుగులు తీశారు.

తాను చేసేది వడ్రంగి పని అని,ఇంటి వద్దే పని చేస్తుంటానని, కరోనా కష్టకాలంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులలో ఉన్నానని, ఈనెల వచ్చిన కరెంట్ బిల్లుతో గుండె ఆగినంత పని అయ్యిందని, ఈ వ్యవహారంపై విద్యుత్‌శాఖ అధికారుల్ని సంప్రదించగా మీటరులోని తప్పిదంతో ఇలా బిల్లు ఎక్కువగా వచ్చింది.. వెంటనే మీటర్ రీడింగ్ పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో లింగాచారి ఊపిరి పీల్చుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    6
    Shares
  • 6
  •  
  •  
  •  
  •