జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

రాజీవ్‌ ఖేల్‌ రత్న నుండి మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నకు మారిన పురస్కారం!!

క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును కేంద్ర ప్రభుత్వం మార్చినట్టు, రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారంగా మార్పు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

భారత దేశంలో ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ప్రారంభించడంతో అప్పటి నుంచి దాన్ని రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుగా పరిగణిస్తున్నారు. దాని పేరు మీద ఒక ప్రశంసా పత్రం, పతకం, నగదు పురస్కారం అందిస్తారు. సాధారణంగా ఈ పురస్కారాన్ని ప్రకటించేందుకు ఏడాది ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, వ్యక్తిగతంగా లేక జట్టుకు ఈ పురస్కారం ఇస్తారు. ఇప్పుడు ఆ పేరు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మారింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •