అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

కృత్రిమ మేధ సాయంతో మహిళలను నగ్నంగా చూపించే సాఫ్ట్‌వేర్??

మహిళల ఫోటోలను కృత్రిమ మేధ సాయంతో నగ్నంగా చూపించే సాఫ్ట్‌వేర్ సేవలను ఉపయోగించుకునేవారు నానాటికీ పెరుగుతున్నారు. ఇలా తయారు చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు. ఒక్క జూన్ నెలలోనే ఈ సేవలను 50 లక్షల సార్లు ఉపయోగించినట్లుగా డేటా వివరాలు సూచిస్తున్నాయి.

ఇలాంటి టూల్స్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందని, బ్రిటన్ పార్లమెంటులో దీనిని గూర్చిన చర్చ జరగాలని పలువురు కోరుతున్నారు. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఫొటోల్లోని మహిళలను వివస్త్రను చేయడానికి ఉపయోగించే సర్వీసుల నిషేధంపై చర్చకు దారి తీసింది. సెలెబ్రిటీలతో పాటు ఒలింపిక్స్ అథ్లెట్ల ఫొటోలు కూడా ఇలాంటి వెబ్‌సైట్ల బారిన పడుతుండడంతో ఇలా రూపొందించే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందుతాయి.

ఒక వెబ్‌సైట్ ‘బట్టల వెనుక ఉన్న నిజాన్ని బహిర్గతం చేస్తాం’ అని తమ వినియోగదారులకు హామీ కూడా ఇచ్చింది. 2020లో ప్రారంభమైన ఈ సైట్‌ వెనుక ఎవరున్నారో ఎంత ప్రయత్నించినప్పటికీ వివరాలు తెలియడం లేదు. ఆ కంపెనీ ట్విట్టర్ పేజీలో ‘ఇది ఏఐ ఆధారిత న్యూడిఫయర్. పురుషులందరి కలలను నిజం చేయడమే మా లక్ష్యం’ అని పేర్కొంది. మరింత శక్తిమంతంగా పనిచేసే ఈ న్యూడిఫయర్ టూల్ కొత్త వర్షన్ కోసం శ్రమిస్తున్నట్లు తయారీదారులు ఒక పోస్టులో పేర్కొనడం గమనార్హం!

‘అనుమతి లేకుండా డిజిటల్‌ పద్ధతుల్లో మహిళల నగ్న, అసభ్యరమైన చిత్రాల తయారీ నిషేధంపై పార్లమెంట్‌లో చర్చించే అవకాశం రావాలి. ఒకవేళ పార్లమెంట్‌లో ఈ అంశం చర్చకు వస్తే చట్టాల్లో మార్పు వస్తుంది’ అని, ‘ఆన్‌లైన్‌లో మహిళల నగ్న చిత్రాలను అందుబాటులో పెట్టడం తీవ్రమైన నేరంగా పరిగణించాలి. ఇది ప్రజల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది.’, ‘ఇలాంటి సాంకేతికతను సాఫ్ట్‌వేర్ డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న‌ట్లయితే వారు పెద్ద నేరం చేస్తున్నట్లే లెక్క. కాబట్టి దీనిని అడ్డుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌లను వారు తయారు చేయాలి.’ అని నిపుణులు పేర్కొంటున్నారు.

సమ్మతి లేకుండా నగ్న, అసభ్యకరమైన చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టడాన్ని రివేంజ్ పోర్న్‌గా పిలుస్తారు. మరియా అనే మహిళ గత ఆరేళ్లుగా రివేంజ్ పోర్న్‌కు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘నగ్న చిత్రాల్ని రూపొందించే సాధనాల గురించి కూడా చట్టంలో కూడా పేర్కొనాలి’ అని ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్న ‘సీజ్’ (సెంటర్ టు ఎండ్ ఆల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్) సంస్థ వివరించింది. ‘మహిళలను మానసిక క్షోభకు, అవమానాలకు గురిచేసే సాంకేతికతను పూర్తిగా నిషేధించాలి. ఈ చిత్రాలను భారీ స్థాయిలో పంపిణీ చేస్తూ లాభాలను ఆర్జిస్తోన్న పోర్న్ సైట్లు ఆ చిత్రాలను అప్‌లోడ్ చేయకుండా నిరోధించాలి.’ అని బాధితులు ఆశిస్తున్నారు.

ఇలాంటి టూల్స్ ఇప్పుడే కొత్తగా వచ్చినవి ఏమి కాదు. 2019లో ప్రారంభమైన ఇలాంటి ఒక వెబ్‌సైట్ కొద్దికాలానికే తమ సర్వీసులను నిలిపి వేసింది. ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో ఖాతాదారులకు డబ్బుల్ని తిరిగి చెల్లించింది. ఈ సాధనాన్ని ప్రజలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ వెబ్‌సైట్ తయారీదారులు గుర్తించడంతో ఇలాంటి వివాదాస్పద సాధనాన్ని వాడేందుకు ప్రపంచం సిద్ధంగా లేదని పేర్కొన్నారు. కానీ దీనిని పోలిన పలు సర్వీసులు ఇంకా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఇలాంటి టూల్స్ రూపకర్త ఇవాన్ బ్రావోతో మాట్లాడగా ‘ ప్రస్తుతం ఈ టూల్స్‌ను ఉపయోగించి చిత్రాలు రూపొందిస్తున్న తీరు అనైతికమే. తొలుత న్యూడ్ యువర్ ఫ్రెండ్స్ అని ప్రచారం చేస్తూ డెవలపర్లు వీటిని తయారు చేశారు’ వ్యాఖ్యానించగా, ‘మనం పరిపూర్ణమైన ప్రపంచంలో జీవించట్లేదు. ఇలాంటి వాటిని చేయడానికి ప్రజలు వేరే మార్గాల్ని వెతుకుతారు. వ్యక్తిగతంగా నేను పురుషులను, కల్పిత పాత్రలను నగ్నంగా చూపించే కొత్త వర్షన్‌ను రూపొందించాలనుకున్నా. దీంతో ప్రజలందరూ ఈ ప్రయోగాన్ని ఆస్వాదించగలుగుతారు.’ అని ‘చట్టాలకు, నైతికపరమైన అంశాలకు లోబడి ఈ టెక్నాలజీని ఎలా వినియోగించవచ్చో తెలుసుకోవడమే ప్రస్తుతం మా లక్ష్యం’ అని ఇవాన్ అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •