టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

దోమలపై దండయాత్ర ప్రకటించిన పదేళ్ల చిన్నారి??

కరోనా మొదటి వేవ్ లో అన్ని జాగ్రత్తలు తీసుకున్న మున్సిపాలిటీ అధికారులు కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం అన్ని జాగ్రత్తలు గాలికి వదిలేసారు. ఈ నేపథ్యంలోనే దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చేస్తున్నాయి. దోమలను తరిమికొట్టడానికి రక రకాల రసాయన ఉత్పత్తులు, దోమ తెరలు వాడాల్సి వస్తుంది. ఈ సమస్యల నుండి బయట పడేయడానికి కేరళలోని తిరువనంతపురంలో అయిదో తరగతి చదువుతున్న పదేళ్ల ఇందిరా అర్జున్‌ తక్కువ ఖర్చుతో ఒక పరికరాన్ని తయారుచేసింది.

మూమూలుగా దోమ తెరలు కొనాలన్నా ఖర్చు బాగానే అవుతుంది. మరి అవి కొనుక్కోలేని వారి పరిస్థితి ఏంటి? అదీ కాక ఆ దోమ తెరలో ఉన్నంతసేపూ బాగానే ఉంటుంది. బయటకు రాగానే మళ్లీ దోమలకు దొరికిపోవడం ఖాయం. ఇది ఆలోచించిన ఇందిరా వాడి పడేసిన ఓ టైరు, పొడవాటి పైపు, గమ్‌, పేపర్‌, పరికరాన్ని తగిలించేందుకు ఊచను తీసుకుంది. ఇప్పుడు మొదటగా టైరును తీసుకుని అర్ధచంద్రాకారంలో కోసింది. ఆ సగం ముక్కను తీసుకుని, టైరు మధ్యలోకి పైపును అతికించి ఆ పైపుకు చివర మూతి బిగించింది. ఇక పైపుతో ఉన్న టైరును ఫొటోలో చూపినట్టుగా ఇంటిలో ఓ మూలగా గోడకు తగిలించింది.

పరికరం తగిలించాక టైరులో నీళ్లు పోసి, ఒక పేపర్‌ను ఆ నీళ్లపైన ఉంచింది. మూడు రోజుల పాటు దాన్ని కదపకుండా అలానే ఉంచేసింది. అలా ఉంచడంతో దోమలు ఆ నీటి చెమ్మకు వచ్చి నీళ్లలో పడిపోయాయ్‌. ఇక 3 రోజుల తర్వాత ఆ నీటిని పైపు ద్వారా వడపోసింది. నీళ్ల మీదున్న పేపర్‌ను క్లోరిన్‌ ద్రావణంలో వేసింది. ఎందుకంటే ఏమైనా దోమ లార్వాలు, గుడ్లు ఉంటే కనుక చనిపోతాయట. ఇక వడబోసిన నీటిని మళ్లీ టైరులో ఉంచి, మళ్లీ దాని మీద కొత్త పేపర్‌ పెట్టింది. అది సరే మళ్లీ అవే నీళ్లు ఎందుకంటారా! ఇక్కడే ఉంది అసలు రహస్యం! దోమలు విడుదల చేసిన ఫెరోమెన్‌ ఆ నీళ్లలోనే ఉంటుంది. దీంతో ఆ వాసనకు దోమలు ఇట్టే ఆకర్షితమవుతాయట. ఇక అప్పట్నుంచే దోమలు ఎక్కువగా మన దోమల ఉచ్చులో పడతాయన్నమాట. ఎలా ఉంది మన ఇందిరా ఆలోచన??

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    14
    Shares
  • 14
  •  
  •  
  •  
  •