జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారి.. జాతికి అంకితం!!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిని భారత రక్షణ శాఖ సరిహద్దు రహదారుల సంస్థ సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన నిర్మించింది. దీనిని భారత రక్షణ శాఖ జాతికి అంకితం చేసింది. తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్‌లింగ్లా పాస్‌ వద్ద 52 కిలోమీటర్ల పొడవునా వాహనాలు వెళ్లగలిగే ఈ రహదారిని నిర్మించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం ప్రపంచంలో ఎత్తయిన మోటరబుల్‌ రోడ్డుగా బొలీవియాలోని రహదారి రికార్డుకెక్కింది. అక్కడ 18,953 అడుగుల ఎత్తులో ఆ రహదారిని నిర్మించారు. ఉమ్‌లింగ్లా పాస్‌ వద్ద నిర్మించిన ఈ రహదారి తూర్పు లద్దాఖ్‌లో చుమార్‌ సెక్టార్‌లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తుంది. దానివల్ల లేహ్‌ నుంచి చిసుమ్లే, డెమ్‌చోక్‌కు చేరుకోవడం సులభతరమైందని రక్షణ శాఖ తెలిపింది.

ఈ రహదారి వల్ల లద్దాఖ్‌లో పర్యాటక రంగం అభివృద్ధి చెంది స్థానికుల ఆర్థిక స్థితిగతులు మారతాయన్న ఆశాభావాన్ని రక్షణ శాఖ వ్యక్తం చేసింది. తూర్పు లద్ధాఖ్‌లో బుల్లెట్ మీద పర్యటించాలని ఎంతో మంది తమ లక్ష్యంగా కూడా పెటుకుని, విశాలమైన పర్వతాల మధ్య ప్రపంచాన్ని మరిచిపోయి తమ ప్రయాణాన్ని సాగించాలని, రైడర్స్ తమ టీంతో సొంత ప్రాంతాల నుంచి లద్ధాఖ్ చేరుకుంటుంటారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రహదారి కొత్త అనుభూతులను పంచుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి అనుభూతిని ఒక్కసారైనా పొందాలంటే ఆ రహదారిపై ప్రయాణించి ఆస్వాదించవలసిందే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •