వార్తలు (News)

వంతెన కింద విమానం ఇరుక్కుపోవడం వెనుక ఏమిజరిగింది??

విమానం ఆకాశంలో ఎగురుతూ, రన్‌వేపై పరుగెత్తడం అందరికి తెలిసిందే! అయితే అతి తక్కువమంది చూడగల్గిన సంఘటన ఒకటి దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోజరిగింది. అదేంటంటే.. ఎయిర్ ఇండియా విమానం దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఒక ఓవర్‌బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. అసలు ఏమిజరిగింది అంటే ఈ విమానాన్ని తుక్కు కింద అమ్మేసినట్టు సమాచారం. విమానాన్ని తరలిస్తున్న సమయంలో ఓవర్‌బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది. వైరల్‌గా మారిన వీడియోలో, విమానం దగ్గరే ట్రాఫిక్ కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. విమానానికి రెక్కలు లేవు. దాని పక్క నుంచే ట్రాఫిక్ కదులుతోంది.

అయితే ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు ఈ విమానంతో ఎలాంటి సంబంధం లేదు అని సదరు సంస్థ ప్రకటనను చేసింది. “ఇది తుక్కు కింద అమ్మేసిన ఎయిర్ ఇండియా విమానం. నిన్న రాత్రి కొనుగోలుదారులు తీసుకు వెళ్లారు. ఎయిర్ ఇండియాకు ప్రస్తుతం ఈ విమానంతో ఎలాంటి సంబంధం లేదు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విమానం 2021 అక్టోబర్‌ 2న రాత్రి సమయంలో వంతెన కింద ఇరుక్కుపోయిందని టెర్మినల్‌3 నుంచి తిరిగి వస్తుండగా, వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని బయటకు తీయడానికి కార్మికులు ప్రయత్నిస్తుండటం చూశాను అని సుప్రభ అనే వ్యక్తి పోస్ట్ చేసారు.

అసలు ఏమి జరిగిందో తెలుసుకోకుండా విమానాన్ని తరలించడానికి ముందే, అది ప్రయాణంచే దారిని చూసుకోవాలంటూ కొందరు సూచించారు. సాధారణంగా రోడ్డు మార్గంలో విమానాన్ని తరలించడానికి ముందు రెండు నుండి మూడు సార్లు రెక్కీ నిర్వహించాలని స్థూలంగా ఇది అన్‌ ప్రొఫెషనల్‌ వర్క్‌ అని సంజీవ్‌ శ్రీవాస్తవ్‌ అనే యూజర్ కామెంట్‌ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •