టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ఇకపై ఉచితం!!

పెయిడ్ సర్వీస్ గా ఉన్న యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ను ఇక నుంచి ఉచితంగా అందించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంటూ ఈ సేవలను నవంబర్ 3 నుంచి కెనడాలో
అందుబాటులోకి తీసుకురానుంది. ఎలాంటి రుసుము చెల్లించకుండా బ్యాక్ గ్రౌండ్ లోనూ సంగీతాన్ని ఆస్వాదించవచ్చని తెలిపింది. ముందుగా ఈ ఫీచర్ రానుంది. కాగా, యూట్యూబ్ లో పాటలు వినాలంటే కచ్చితంగా వీడియో చూడాల్సి వచ్చేది. బ్యాటరీ, డేటా త్వరగా ఖర్చయ్యేది. అందుకే గూగుల్ యూట్యూబ్ మ్యూజిక్ యాప్ తీసుకొచ్చి ఎలాంటి రుసుము చెల్లించకుండా బ్యాక్ గ్రౌండ్ లోనూ సంగీతాన్ని ఆస్వాదించవచ్చని తెలిపింది. ముందుగా ఈ ఫీచర్ రానుంది. కాగా, యూట్యూబ్ లో పాటలు వినాలంటే కచ్చితంగా వీడియో చూడాల్సి వచ్చేది. బ్యాటరీ, డేటా త్వరగా ఖర్చయ్యేది. అందుకే గూగుల్ యూట్యూబ్ మ్యూజిక్ యాప్ తీసుకొచ్చింది.

YouTube మ్యూజిక్ యాప్ ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం మెంబర్లకు మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్‌ను అనుమతిస్తుంది. మీరు చెల్లింపు కస్టమర్ కాకపోతే, మీరు యాప్‌ను మినిమైజ్ చేయలేరు. మీరు ఏదైనా ఇతర యాప్‌కి మారినా లేదా మీ స్క్రీన్‌ను ఆఫ్ చేసినా ప్లేబ్యాక్ ఆగిపోతుంది. కానీ కొత్త ఫీచర్‌తో, ఎలాంటి చెల్లింపు చేయకపోయినా ఇతర మ్యూజిక్ యాప్ ల మాదిరిగానే యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ని ఉపయోగించగలుగుతారు. అంతేకాదు రేడియో స్టేషన్ల ఫీచర్‌కి యాక్సెస్ కలిగి ఉంటారు. అలాగే ప్లే జాబితాలను క్రియేట్ చేయగలరు. మీరు ఏదైనా పాటలను అప్‌లోడ్ చేసినట్లయితే, మీరు వాటిని ఎప్పుడైనా ప్లే చేయవచ్చు. కాగా, ఈ ఫీచర్ యాడ్ సపోర్టెడ్. మీరు మ్యూజిక్ వినేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి. ఒకవేళ యాడ్స్ రాకుండా ఉండాలనుకంటే ప్రీమియమ్ ప్లాన్ కోసం చెల్లించాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •