ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,788 పరీక్షలు నిర్వహిస్తే 122 కొత్తకేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందడంతో ఇప్పటి వరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,453కి చేరింది. గత 24 గంటల్లో 213 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,57,369 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,030 క్రియాశీల కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..