తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ర్యాపిడో ప్రకటనలో ఓ సన్నివేశం ఉండడంతో దీనిపై గతంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఆ ప్రకటనను ప్రసారం చేయడం నిలిపివేయాలంటూ, యూట్యూబ్‌లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని ర్యాపిడోను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ర్యాపిడో టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే.

గతంలోనే ఆ ర్యాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్‌ కు, ర్యాపిడో సంస్థకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే టీవీ ప్రకటన నుంచి టీఎస్ఆర్టీసీ బస్సులను చూపించిన క్లిప్‌ను తొలగించింది.