దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే కదా! ఇప్పుడు షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంతో పాటు దిశ మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని ఆ బృందం పరిశీలించింది. అధికారుల పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్‌ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో చటాన్‌పల్లిలో పోలీసులు మీడియాను మాత్రం అనుమతించలేదు. ఈ బృందం అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని, అందరి వాంగ్మూలాలు పరిశీలించిన అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.