జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు విశాఖలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు శనివారంతో ముగిశాయి. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌ హాలులో శనివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో కేరళ రాష్ట్రం 16 బంగారు, 16 వెండిపతకాలు మొత్తంగా 32 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా, రెండవ స్థానాన్ని కర్నాటక 15 బంగారు, 14 సిల్వర్‌ మెడల్స్‌తో 29 పతకాలను సాధించింది. ఇక మూడో స్థానాన్ని తమిళనాడు బంగారు పతకాలు 8, సిల్వర్‌ 13, పథకాలు సాధించి గెలుచుకోగా, నాల్గో స్థానంలో ఆంద్రప్రదేశ్‌ 12 బంగారు, 8 సిల్వర్‌ పతకాలు గెలుచుకుంది. ఇక తెలంగాణ కేవలం 2 బంగారు పతకాలు సాధించి ఆఖరి స్థానంలో నిలిచింది.

ఈ పోటీలలో ఐదు రాష్ట్రాల నుంచి 124 మంది విజేతలుగా నిలవగా బంగారు పతకాలు సాధించిన వారికి క్యాష్‌ ప్రైజ్‌ రూపంలో రూ.21వేలు, వెండి పతకాలకు రూ.11 వేలు నగదు బహుమతి అందించారు.