దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 6-8 తేదీల్లో జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం లో కీలక రేట్లను యథాతథంగానే ఆర్‌బీఐ కొనసాగించొచ్చనే సంకేతాలు వెలువడుతుండడంతో విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 108 పాయింట్ల నష్టంతో 57,587 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17,165 వద్ద ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, టైటన్‌ షేర్లు లాభాలబాటలో పయనిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, మారుతీ, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.