ఐఐటీ లు, ఐఐఎంలలో చదవాలని చాలామంది పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే అందులో చదవడానికి సీట్ సంపాదించాలంటే ఏంటో ప్రతిభ కావాలి. అందుకే మల్టీ నేషనల్‌ కంపెనీలు కూడా ఐఐటీయన్స్‌కి ఏడాదికి కోట్లలో జీతం చెల్లించడానికి వెనకాడవు. ఈ జాబితాలోకి తాజాగా ట్యాక్సీ రైడ్‌ దిగ్గజ సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్ చేరింది. ఒక ఐఐటీ విద్యార్థికి ఏడాడికి రూ. 2.5 కోట్ల ప్యాకేజీతో తమ కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది.

ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతిభకు ఉబర్‌ మెచ్చుకుని ఏడాదికి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వేతనం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అలానే ఐఐటీ గుహవటి విద్యార్థికి ఏడాదికి సుమారు 2 కోట్ల రూపాయల వేతనం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. నివేదికల ప్రకారం ఈ ఏడాది 11 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ వేతనంతో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.