ప్రయాణికులు మెట్రో ఎక్కిన తరువాత కాలక్షేపం కోసం మొబైల్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. అంతర్జాలం లేకపోయినా వీడియోలను వీక్షించడం, డౌన్లోడ్ చేసుకునేందుకు షుగర్‌బాక్స్ మెట్రోలో నెట్వర్క్స్ ఏర్పాటు చేసింది. హైపర్ లోకల్ క్లౌడ్ ఆధారిత టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ప్రతి మెట్రోరైలు లోపల, రద్దీ ఎక్కువ ఉండే స్టేషన్లలో నెట్వర్క్ ఏర్పాటు చేయడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి యాప్ డౌన్లోడ్ చేయిస్తూ అనంతరం మెట్రోలో ప్రయాణించినంతసేపు నెట్ లేకపోయినా అందులోని కంటెంట్‌ను విమానాల్లో లాగానే వీక్షించవచ్చని ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో సీఈవో కేవీబీ రెడ్డి అన్నారు.
షుగర్ బాక్స్ చేసిన సర్వే ప్రకారం విశేషాలు ఏంటంటే..
మెట్రో ప్రయాణం.. మొబైల్‌తో కాలక్షేపంప్రయాణంలో నగరవాసులు దాదాపు 60 నిమిషాల పాటు మొబైల్లోనే గడుపుతున్నారు.యూట్యూబ్, వాట్సాప్ ఎక్కువగా చూస్తున్నారు. నెట్వర్క్ సమస్యలతో 75 శాతం మంది షుగర్ బాక్స్ సేవలను వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నారు. పనిరోజుల్లో మధ్యాహ్నం వేళల్లో, వారాంతాల్లో ఎక్కువ కంటెంట్ చూస్తున్నారు.