దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,13,377 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 1,17,100 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.52 కోట్లుగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 302 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.8 లక్షల మందికి చేరింది. గత 24 గంటల్లో 30 వేల మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.43 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 3,71,363కి పెరిగింది.

దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం ఓమిక్రాన్ కేసులు 3,007కి చేరాయి. గత 24 గంటల్లో 377 మందిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 876 మంది దీని బారినపడగా దిల్లీలో ఆ సంఖ్య 465కి చేరింది. మొత్తం మూడు వేల మందిలో 1,199 మంది కోలుకొని, ఇళ్లకు చేరుకున్నారు.