సంక్రాంతి అంటేనే బంధువులు అందరు ఒకచోట చేసి ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. కానీ కరోనా నేపథ్యంలో ఎక్కువమంది తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి సంకోచిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఎలా అయినా సొంత వారిని కలవాలని ఆశతో సొంత ఊరి బాట పడ్డారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు.. తిరుపతి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07460) ఈ నెల 10న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌-తిరుపతి రైలు (82720) 11వ తేదీ∙సాయంత్రం 7.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుపతి-కాచిగూడ ప్రత్యేక రైలు (07461) 12న మధ్యాహ్నం 3.20 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. కాచిగూడ-తిరుపతి ప్రత్యేక రైలు (07642) ఈ నెల 13న మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది.