ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 37,849 నమూనాలు పరీక్షిస్తే 840 కొత్తకేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా కారణంగా ఒకరు మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుండి 133 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,972 యాక్టివ్‌ కేసులున్నాయి.