ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఈబీసీ నేస్తం’ పథకానికి 3,92,674 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం కింద ఈబీసీ వర్గానికి చెందిన 45-60ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.15వేల చొప్పున సాయాన్ని అందిస్తారు. ఇందుకుగానూ రూ.589 కోట్లు వ్యయం కానుంది. ఈ పథకాన్ని ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. పథకం ప్రారంభానికి ముందు రెండు రోజులు, ఆ తర్వాత మరో 7 రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు ప్రభుత్వం ఆదేశించింది.