గత ఏడాదిలో మొత్తం పనిదినాల్లో రోజుకు 1880 పాస్‌పోర్టులను జారీచేసినట్లు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం (ఆర్పీవో) వెల్లడించింది. గత ఏడాది పనితీరుకు సంబంధించిన వార్షిక నివేదికను ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం విడుదల చేస్తూ పాస్‌పోర్టు కోసం తత్కాల్‌లో దరఖాస్తు చేసినవారికి మూడు రోజుల్లోపు, సాధారణ దరఖాస్తుదారులకు 7-10 రోజుల్లోపు అందించినట్టు వివరించారు.