దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు కూడా లాభాలతోనే ముగించాయి. ఉదయం సెన్సెక్స్‌ 59,776.10 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమై ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసి మధ్యాహ్నం తర్వాత 59,401.44 వద్ద స్వల్ప నష్టాల్లోకి జారకుని, అక్కడి నుంచి చివరి వరకు ఊగిసలాటలో పయనించి, చివరకు 142.81 పాయింట్ల లాభంతో 59,744.65 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,797.60 వద్ద సానుకూలంగా ప్రారంభమై 17,905.00-17,704.55 మధ్య కదలాడి, చివరకు 66.80 పాయింట్లు లాభపడి 17,812.70 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రా టెక్ సిమెంట్, ఆసియన్ పాయింట్స్, నెస్లే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకు, టిసిఎస్ షేర్లు లాభాల్లో ముగిసాయి. ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ డి ఎఫ్ సి షేర్లు నష్టాల్లో ముగిసాయి.