ఎన్నికలు (Elections) రాజకీయం (Politics)

పురపాలక శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పాయింట్స్..

 • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్
 • సొంత గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది
 • 2015లో బాబు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం జరిగింది
 • కేంద్ర కేబినెట్ మంత్రిగా అశోకగజపతిరాజు ఉన్నప్పుడే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు
 • అన్ని అంశాలు తెలిసే చంద్రబాబు బురద జల్లుతున్నారు… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బాబే బాధ్యత వహించాలి
 • సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ నిర్ణయం బాధాకరం.. ఎస్ఈసీ తొందరపాటు నిర్ణయాలతో వ్యవస్థలకు చెడ్డపేరు వస్తోంది
 • మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికే పరిమితమవ్వాలన్న ఎస్ఈసీ నిమగడ్డ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది
 • ఎస్ఈసీ ఇష్టంవచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదని హైకోర్టు తీర్పుతో తేలింది
 • గ్రామాభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయానికి ఎస్ఈసీ అడ్డుపడటం తగదు.. ఏకగ్రీవాలపై ప్రజల నిర్ణయాన్ని ఎస్‌ఈసీ గౌరవించాలి
 • చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏగ్రీవాలపై ఎస్ఈసీ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి
 • టీడీపీ మేనిఫెస్టోపై ఎస్ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలి.. ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీపై అనర్హత వేటు వేయాలి

స్థానిక ఎన్నికలు సందర్భంగా అనంతపురం జిల్లాలోని ప్రజాప్రతినిధులతో, పార్టీ నేతలతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు( ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రి శ్రీ శంకరనారాయణతో పాటు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..

 1. అనంతపురం జిల్లాలో నూటికి 90 శాతం మేం విజయం సాధిస్తాం. ఇది వాస్తవం. సీఎం శ్రీ జగన్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి మారుమూలన ఉన్న ప్రతి అర్హుడుకీ అందిస్తున్నాం. దీనివల్ల ప్రజలంతా మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతున్నాం.
 2. రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు. అది శాశ్వతంగా ఆంధ్రులకే ఉండాలన్నది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని వార్తలు వచ్చాయి. పారిశ్రామీకరణ విధానంలో భాగంగా కేంద్రం నిర్ణయం తీసుకోవటం చూశాం. దీనిపై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు ఏమి మాట్లాడినా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సీఎం శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి గారు లేఖ ద్వారా ప్రధాని మోడీకి తెలిపారు. ఇది ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం.
 3. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ కొన్ని సంవత్సరాలు లాభాల్లో నడిచింది. ఆ తర్వాత నష్టాలు వచ్చిన మాట వాస్తవమే. అయినా నష్టాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తగిన చర్యలు తీసుకుంటే నష్టాల నుంచి బయటపడుతుందని ముఖ్యమంత్రి గారు ప్రధానికి లేఖ ద్వారా కోరారు. విశాఖ ఉక్కుకు కేపిటివ్ మైన్‌ లేదు. విశాఖ ఉక్కుకు కేపిటివ్ మైన్ ఉంటే నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుల్ని ఈక్విటీ కింద మార్చుకుంటే దాని నష్టాల నుంచి బయటపడొచ్చు. తక్కువ వడ్డీతో రుణాల్ని రీషెడ్యూల్ చేస్తే నష్టాల నుంచి విశాఖ ఉక్కు బయటపడొచ్చనేది మా పార్టీ అభిప్రాయం. ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని మా ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. దయచేసి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ పునరాలోచించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. సీఎం గారి విజ్ఞప్తిని ప్రధాని మోడీ మన్నించాలి.
 4. చంద్రబాబు హయాంలోనే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా అశోకగజపతిరాజు ఉన్నప్పుడే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెల్సు. ఆనాడు విశాఖ ఉక్కు గురించి ఏమీ మాట్లాడకుండా ఈనాడు వచ్చి అవాకులు, చెవాకులు పేలుతున్నారు. చంద్రబాబు అలవాటు ప్రకారం ఆయన సహజమైన బుద్ధితో ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నారు. బురద చల్లటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని మీడియా ద్వారా ప్రధానమంత్రిని కోరుతున్నాం.
 5. స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకుండా ఎన్నికలు జరగాలి. ఎన్నికలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. ఎక్కడా కూడా ఏవిధమైన రాగద్వేషాలకు అతీతంగా, ప్రలోభాలకు తావులేకుండా ప్రభుత్వ యంత్రాంగమంతా సహకరిస్తోంది. నిన్న, మొన్నటి పరిణామాలు చూస్తే.. గుంటూరు, చిత్తూరులో ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం తొందరపాటు చర్య తీసుకుంది. ఆ నిర్ణయంపై ఎస్‌ఈసీ పునరాలోచించుకోవాలి.
 6. అనాలోచితంగా ప్రభుత్వంపై బురద చల్లాలనే దురుద్దేశంతో ఎస్‌ఈసీ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాల వల్ల లేనిపోని అపవాదులకు తావు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ ఏ అధికారులు అయితే ఎన్నికల నిబంధనలకు లోబడి కాకుండా, ఆనాలోచితంగా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటే వారిపై చర్యలుంటాయని చెప్పారు. ఆమాట అన్న మంత్రి పెద్దిరెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలు చాలా బాధాకరం, శోచనీయం. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని హౌస్ అరెస్ట్ అంటే ఆయన వ్యక్తిత్వానికి, గౌరవానికి ఎంతో భంగం.
 7. గ్రామాల అభివృద్ధికి తోడ్పడేలా ఎన్నికల కమిషన్‌ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కడ అవసరమో అక్కడ ఎన్నికలు జరపాలి. కానీ మా గ్రామంలో ఎన్నికలు వద్దు. మేమంతా సమైక్యంగా ఉంటాం.. అని చెప్పినా ఏకగ్రీవాలు కాకూడదన్నట్టుగా ఎస్ఈసీ వ్యవహరించడం సమంజసం కాదు. పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం బాటలో వెళ్లొద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్‌ కూడా సంయమనం పాటించాలి. దీనిపై ఆలోచన కూడా చేయాలి. ఈ అనంతపురం జిల్లాలో పెద్దలు అందరితో సమీక్షించిన తర్వాత ప్రభుత్వంపైన, సీఎం శ్రీ జగన్ గారి ప్రజాసంక్షేమ కార్యక్రమాలపైన సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో నూటికి 90 శాతం సర్పంచ్ స్థానాల్ని గెలుస్తామని మంత్రులు, నాయకులు చెబుతున్నారు.

టీడీపీ గుర్తింపునే రద్దు చేయాలిః మంత్రి బొత్స సత్యనారాయణ
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
8- టీడీపీ మేనిఫెస్టో విషయంలో ఎన్నికల సంఘానికి వైయస్‌ఆర్‌సీపీగా ఫిర్యాదు చేశాం. చట్టపరంగా పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరగాలని చెప్పాం. కానీ ఎన్నికల కమిషనే పేదలకు బియ్యం పంపిణీ చేస్తాం అంటే చేయటానికి వీల్లేదు. వాటి మీద పార్టీ రంగులు ఉన్నాయని చెప్పారు. అటువంటి నేపథ్యంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తే.. మేనిఫెస్టోను రద్దు చేయటం కాదు.. టీడీపీ గుర్తింపునే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆ పార్టీకి అర్హత లేదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్‌ఈసీకి లేని అధికారంతో మంత్రి పెద్దిరెడ్డి గారి మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఎస్‌ఈసీకి ఉన్న అధికారంతో టీడీపీ మీద క్రిమినల్ కేసులు పెట్టి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీడియా ద్వారా ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాను.

9- హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగం ఉపేక్షించబోదని చెబుతోంది. ఎన్నికల కమిషనర్‌.. తానే సర్వాధికారిని అన్నట్లు వ్యవహరిస్తే చెల్లదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగానే ఎవరైనా విధులు నిర్వర్తించాలి. ఇష్టారాజ్యంగా ఎస్‌ఈసీ వ్యవహరిస్తానంటే చెల్లే పరిస్థితి కాదు. ఈ విషయాన్నే న్యాయస్థానాలు చెప్పాయి. ఇవి చూసిన తర్వాతైనా కనువిప్పు వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిష్పాక్షపాతంగా ఎన్నికలను జరపాలని ఎన్నికల కమిషన్‌ ను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.