ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ జరగనున్న పోలింగ్

వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు

ఫిబ్రవరి 7, అనంతపురము

ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీలలో నాలుగు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

పెరిగిన పోలింగ్ సమయాన్ని గమనించి , కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రజలు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవలసిందిగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు..