బాహుబ‌లితో ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా హీరోగా ఎద‌గ‌గా, కేజీఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. వీరిద్ద‌రు క‌లిసి తీస్తున్న సినిమా స‌లార్‌. ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇండియా వైడ్‌గా అంచ‌నాలు ఉన్నాయి. భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాలో ఇప్పుడిప్పుడు క్యాస్టింగ్‌ను ఖ‌రారు చేస్తున్నారు.

అయితే, స‌లార్‌లో విల‌న్‌గా ప్ర‌భాస్‌ను ఢీకొట్టే న‌టుడు ఎవ‌రనేది అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ప్ర‌శాంత్ నీల్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేస్తారు. కాబ‌ట్టి, విల‌న్ కూడా హీరోకు త‌గ్గ‌ట్లుగా ఉండాల‌ని భావించి అటువంటి విల‌న్‌ను వెతుకుతుండ‌గా ఇప్పుడు క‌న్న‌డ‌లోనే ఓ న‌టుడిని విల‌న్‌గా ఫైన‌ల్ చేశారంట‌. ఈ విష‌యాన్ని స‌ద‌రు న‌టుడే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

క‌న్న‌డంలో ప‌లు సినిమాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న మ‌ధు గురుస్వామి స‌లార్ సినిమాలో నటిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. త‌న‌కు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు మ‌ధు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం గోదావ‌రిఖ‌నిలోని బొగ్గుగ‌నుల్లో షూటింగ్ జ‌రుగుతోంది.