ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 136 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 45,702 నమూనాలను పరీక్షించగా రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఈ విషయం పై వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు జిల్లాలో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7174కి చేరింది. గడచిన 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,36,179 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.