రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.


టెన్త్ పాస్ అయినవారు ఈ పోస్ట్ లకు అర్హులు. RBI ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ. 2021 ఫిబ్రవరి 24 నుంచి 2021 మార్చి 15 మధ్య ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ టెస్ట్ 2021 ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఉంటుంది

మొత్తం 841 ఖాళీలు ఉండగా అందులో హైదరాబాద్ – 57, అహ్మదాబాద్ – 50, బెంగళూరు – 28, భోపాల్ – 25, భువనేశ్వర్ – 24, చండీగఢ్ – 31, చెన్నై – 71, గౌహతి – 38, జమ్మూ – 9, జైపూర్ – 43, కాన్పూర్- 69, కోల్‌కతా – 35, ముంబై – 202, నాగ్‌పూర్ – 55, న్యూ ఢిల్లీ – 50, పాట్నా – 28, తిరువనంతపురం – 26 పోస్టులున్నాయి.

విద్యార్హతల వివరాలు 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ కావాలి. రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలోని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో పాస్ అయి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. గ్రాడ్యుయేట్స్ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేయకూడదు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. 1996 ఫిబ్రవరి 2 నుంచి 2003 ఫిబ్రవరి 1 లోపు జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.50. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్. ఈ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది. ఎంపికైన వారికి వేతనం రూ.26,508 లభిస్తుంది.

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://rbi.org.in/ లేదా https://opportunities.rbi.org.in/వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.