నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన
నలుగురు చెంచులు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి అగ్నికీలల్లో చిక్కుకున్నారు.
గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించి అడవికి నష్టం వాటిల్లింది.

ఈ సమాచారం అందగానే అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.