సెంట్రల్ ఆఫ్రికాలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో దక్షిణ కివు ప్రావిన్స్‌ లుహిహిలో ఒక బంగారు కొండ వెలుగు చూసింది. కొత్తగా బయటపడిన ఆ బంగారు కొండలో 60 నుంచి 90 శాతం వరకు పసిడి ఉందని కొందరు చెబుతున్నారు. ముందుగా ఒకరిద్దరికి తెలిసిన ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఆ ఆ ప్రదేశంలో నివసించే అందరికి తెలిసిపోయింది. దీనితో చేతికందిన వస్తువులతో ఆ బంగారు కొండపైకి దండెత్తి గడ్డపారలు, ఇతర వస్తువుల సాయంతో నేల నుంచి బంగారాన్ని తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.