మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ పేరిట సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగ సంక్షేమ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను తెలంగాణ సచివాలయంలోని అన్ని విభాగాలకు, అన్ని విభాగాల అధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు.