అంతర్జాతీయం (International) వార్తలు (News)

బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం

కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో రికార్డుస్థాయిలో కొత్త మరణాలు సంభవిస్తున్నాయి. కొవిడ్‌ కేసుల్లో 24 గంటల్లో అత్యధికంగా 4195 మరణాలు నమోదైనట్లు, అమెరికా, పెరూలో మాత్రమే ఇప్పటివరకు ఒక్కరోజులో నాలుగు వేల మరణాలు సంభవించినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 1.31 కోట్ల మంది కొవిడ్‌ బారిన పడ్డారు.కోవిద్ తో 3.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఉన్న 90 శాతం ఐసీయూల్లో కొవిడ్‌ రోగులే చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా బ్రెజిల్‌లో 3 శాతం మంది ప్రజలు కొవిడ్‌ టీకాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.