ఏపీలో 24 గంటల వ్యవధిలో 31,812 నమూనాలను పరీక్షించగా 2,331 మందికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,13,274కి చేరింది. చికిత్స పొందుతూ 11 మంది మృతిచెందడంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,262కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,02,583 నమూనాలను పరీక్షించారు. 24 గంటల వ్యవధిలో 853 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా ఇప్పటికి 8,92,736 మంది పూర్తిగా కోలుకున్నట్లు, ప్రస్తుతం 13,276 యాక్టివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.